తేట తేట పాల నురుగు,
అక్షరాల విరుల వాగు
చుక్కలమ్మ కాంతి వెలుగు,
కన్న తల్లి తెలుగు తెలుగు !
జాలమంతా తెలుగు పెరుగు
తెలుగుబ్లాగు అయ్యే మెరుగు
గోడలన్నీ విరుగు విరుగు
కొత్తబ్లాగు తెలుగు తెలుగు !
పొరుగు భాష కొంత తరుగు
సొంత భాష నేర్చ మెరుగు
గంగిగోవు పాల పొదుగు
అమ్మ భాష తెలుగు తెలుగు !
సిగ్గు పడకు, వాడు తెలుగు
నేర్పు నువ్వు కొంత తెలుగు
తెలుగు భాష జాతి సొబగు
నేర్వవోయి తెలుగు తెలుగు !
No comments:
Post a Comment