Saturday, July 25, 2009

తెలుగుతల్లి బిడ్డలకు వందనం

అదిల నుంచి హంపి దాక
కృష్ణరాయని కీర్తి చుసిన

గోదారి నుంచి పెన్న దాక
ఆంద్రకేసరి పఠిమ గాంచిన

అరుకు నుంచి కడప దాక
ఎన్టిఆరునీ ప్రతిభ ఎరిగిన

తెలుగు తల్లి బిడ్డలకు
పాలకప్రియ వందనం

ఆవకాయ రుచిని మరిగిన
సక్కినాలు పంట కొరికిన

ఉలవచారు జుర్రు కున్నిన
మినపసున్ని నోట మింగిన

ముద్దపప్పు అంతు చుసిన
గుత్తి వంకాయి ఆరగించిన

తెలుగు తల్లి బిడ్డలకు
షడ్రుచోపేత వందనం

ఏడు కొండలు ఎదురుచూసిన
తాళ్ళపాక కృతులు విన్న

రామ భద్రుని నిలువరించిన
రామదాసుని పదము విన్న
నాల్గు జాతులు ముగ్డులైన
త్యాగరాయ కృతులు విన్న

తెలుగుతల్లి బిడ్డలకు
సరిగమప్రియ వందనం





No comments: